GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 7:14 am Digital Edition : GURU SWAMY

టీటీడీ జేఈవోగా శ్రీ ప్రభల గోపీనాథ్ బాధ్యతలు స్వీకరణ

టీటీడీ నూతన జేఈవో (వైద్యం మరియు విద్య)గా నియమితులైన శ్రీ ప్రభల గోపీనాథ్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.