టీడీపీకి షాక్.. వైసీపీలోకి టీ.ఎన్. కుప్పం టీడీపీ నాయకులు!

జగన్ సంక్షేమ పథకాలపై నమ్మకంతో వైసీపీలో చేరిక బైరెడ్డిపల్లి, గరుడదాత్రి, అక్టోబర్ 31: బైరెడ్డిపల్లి మండలంలోని కడపనత్తం గ్రామ పంచాయతీ పరిధి టీ.ఎన్. కుప్పం గ్రామానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి, వేమారెడ్డి, నారాయణప్ప తదితరులు టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకంతోనే వైసీపీలో చేరినట్లు తెలిపారు....