GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 7:24 am Digital Edition : GURU SWAMY

టీడీపీలో చేరిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు

* అందరినీ పార్టీలోకి ఆహ్వానించిన లోకేష్.
కుప్పం,సెప్టెంబర్ 28 (గరుడ ధాత్రి ప్రత్యేక ప్రతినిధి):స్థానిక ఎన్నికల వేళ మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. విద్య, ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ సమక్షంలో మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి మండలాలకు చెందిన పలువురు సీనియర్ వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. మంగళగిరి పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్, పట్టణ వైసీపీ మాజీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, ఆయన సతీమణి, మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. తాడేపల్లి రూరల్ ఉండవల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ కళ్లం సంజీవ్ రెడ్డితో పాటు ఆరు కుటుంబాలు, తాడేపల్లి పట్టణానికి చెందిన సీనియర్ వైసీపీ నేతలతో పాటు పెద్ద సంఖ్యలో తెలుగుదేశంలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి లోకేష్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.