టీడీపీలో చేరిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు
* అందరినీ పార్టీలోకి ఆహ్వానించిన లోకేష్. కుప్పం,సెప్టెంబర్ 28 (గరుడ ధాత్రి ప్రత్యేక ప్రతినిధి):స్థానిక ఎన్నికల వేళ మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. విద్య, ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ సమక్షంలో మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి మండలాలకు చెందిన పలువురు సీనియర్ వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. మంగళగిరి పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్, పట్టణ వైసీపీ మాజీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, ఆయన సతీమణి, మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ మంత్రి...