టీడీపీ నాయకుడు కే. బాలాజీ నాయుడు మృతి

పిచ్చాటూరు, జూన్ 10 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కే. బాలాజీ నాయుడు (56) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన సీనియర్ టీడీపీ నాయకుడు దివంగత కే. నరసింహులు నాయుడు కుమారుడు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న బాలాజీ నాయుడు స్వగ్రామం నీరువాయిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలాజీ నాయుడు గ్రామ అభివృద్ధి, పార్టీ...