నాగలాపురం మండలంలోని ఎస్‌ఎస్ పురం హరిజనవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ నిస్వార్థ కార్యకర్త రుద్రయ్య మృతితో మాకు తీవ్ర విషాదం కలిగిందన్నారు. ఆయన పార్ధివ దేహానికి నాగలాపురం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టీజేబి ప్రణీత్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. రుద్రయ్య మృతికి నివాళులు అర్పించిన వారిలో మాతయ్య, సురేష్ యాదవ్, వార్డ్ మెంబర్ వెలుములై, నాగరాజు, పార్తిబన్, స్కూల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రుద్రయ్య సేవలను పార్టీ ఎప్పటికీ మరువదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి మనఃపూర్వక సానుభూతి తెలిపారు.