GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 6:01 am Digital Edition : GURU SWAMY

టీడీపీ మద్దతుదారు సిద్ధంశెట్టి కుప్పయ్య మృతికి కోనేటి సుమన్ కుమార్ నివాళి

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం కళ్యాణపురం (ఉజ్జినాయుడు కండ్రిగ) గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ మద్దతుదారు, మాజీ సర్పంచ్ సిద్ధంశెట్టి శంకరయ్య గారి చిన్నాన్న శ్రీ సిద్ధంశెట్టి కుప్పయ్య (65) శనివారం మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న సత్యవేడు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారి తనయుడు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు శ్రీ కోనేటి సుమన్ కుమార్ గారు ఆదివారం ఉదయం మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని తనయుడు, జనసేన పార్టీ నాయకుడు బాలును ఓదార్చి, కుటుంబానికి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సిద్ధంశెట్టి లోకయ్య, సిద్ధంశెట్టి శంకరయ్య, మాణిక్యం రెడ్డి, అచ్చుకట్ల హరి, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.