GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 4:42 pm Posted by : GARUDA DHATRI NEWS

టీడీపీ యువనేత కూరపాటి శంకర్ రెడ్డి కి ఘన సన్మానం

-శంకర్ రెడ్డి సేవలను కొనియాడిన అంగన్వాడీ సహాయకురాలు

గరుడధాత్రి :
అంగన్వాడీ సహాయకురాలి పోస్టు పొందడంలో సహకరించిన సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ కూరపాటి శంకర్‌రెడ్డికి లబ్ధిదారురాలు ఆదివారం వరదయపాలెం లో ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, పూలమాలలు వేసి, పూలు, పండ్లు అందజేసి సన్మానించారు.
పిచ్చాటూరు మండలం వడ్లకుప్పం గ్రామానికి చెందిన ఎన్. కలైవాణి అంగన్వాడీ సహాయకురాలిగా ఎంపికైన నేపథ్యంలో, తనకు ఉద్యోగం రావడంలో శంకర్‌రెడ్డి అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ అవకాశాలు అర్హులైన వారికి చేరేలా నిరంతరం కృషి చేస్తున్న శంకర్‌రెడ్డి సేవలను ఆమె కొనియాడారు.
ఈ సందర్భంగా శంకర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొని నూతనంగా ఎంపికైన అంగన్వాడీ సహాయకురాలికి శుభాకాంక్షలు తెలిపారు.