ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడికి కౌన్సెలింగ్
*హెల్మెట్ ధరించి, పరిమితికి మించి ప్రయాణించవద్దు: ఎస్‌ఐ శివశంకర్‌రావు *గరుడ దాత్రి నాయుడుపేట ఆగస్టు 21 వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నాయుడుపేట పట్టణ ఎస్‌ఐ ఎం. శివశంకర్‌రావు సూచించారు.శుక్రవారం పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనంపై ఐదుగురు కుటుంబ సభ్యులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న విషయాన్ని గుర్తించిన ఎస్‌ఐ వాహనాన్ని ఆపి కౌన్సెలింగ్ ఇచ్చారు. పరిమితికి మించి ప్రయాణించడం ప్రమాదకరమని, కుటుంబ సభ్యుల భద్రతపై వాహనదారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.వాహనం...