ట్రిపుల్ ఐటీ కలలపై ప్రమాదం నీడ.. తేజస్వినికి న్యాయం చేయాలి..
గరుడధాత్రి : సత్యవేడు మండలం మాధనపాలెంకు చెందిన ఆర్. తేజస్విని జీవితాన్ని మార్చే రోజుగా భావించిన జూన్ 22, ఆమె కుటుంబానికి విషాదాన్ని మిగిల్చింది. పదో తరగతిలో 573 మార్కులు సాధించి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించిన తేజస్విని, కౌన్సిలింగ్‌కు హాజరయ్యేందుకు తల్లిదండ్రులతో కలిసి బయలుదేరగా రాజంపేట సమీపంలోని పుల్లంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం వారి ఆశలపై నీళ్లు చల్లింది. లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో తేజస్వినికి రెండు చేతివేళ్లు తెగిపోవడంతో పాటు కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె తిరుపతిలోని...