డప్పు కళాకారులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలి
అరుణోదయ డప్పు కళాకారుల సంఘం డిమాండ్ సత్యవేడు, మే 28 గరుడధాత్రి: సత్యవేడు మండలంలో ఉన్న అర్హత కలిగిన డప్పు కళాకారులందరికీ నెలకు రూ.7,000 కొత్త పింఛన్లు మంజూరు చేయాలని అరుణోదయ డప్పు కళాకారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘ నాయకుడు దేశాండీ అరుణాచలం సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. సత్యవేడు మండలంలోని శిరణంబుదూరు దళితవాడలో డప్పు కళాకారుల సంఘం ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణాచలం మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం డప్పు కళాకారులకు...