డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపీఎస్

గరుడధాత్రి న్యూస్ : చిత్తూరు జిల్లా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే భాగంగా, ఇటీవల పెరుగుతున్న “డిజిటల్ అరెస్ట్” మోసాలపై ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపీఎస్ గారు సూచించారు నేటి డిజిటల్ యుగంలో నేరస్తులు కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా పోలీస్, సీబీఐ, ఈడీ వంటి అధికారులుగా నటిస్తూ భయపెట్టి డబ్బులు దోచుకునే సంఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో మోసగాళ్లు వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌ల...