GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 6:30 am Posted by : GURU SWAMY

డిజిటల్ గవర్నెన్స్‌లోనూ గూగుల్ భాగస్వామ్యం

-వివిధ రంగాల్లో గూగుల్‌తో కలిసి పని చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్

-ఏపీలో లాజిస్టిక్స్ పార్కులు… సప్లై చైన్ సిటీ నిర్మాణానికి విస్తృత అవకాశాలు
-యూఎన్ హాబిటాట్ సెంటరాఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు ఆహ్వానం

-సింగపూర్‌లో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు

సింగపూర్, జూన్ 15: వివిధ రంగాల్లో సంయుక్తంగా పనిచేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ నిర్ణయించాయి. సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం గూగుల్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో సమావేశమయ్యారు. ఈ మేరకు జరిగిన చర్చల్లో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో గూగుల్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే అభిప్రాయానికి ఇరువురు వచ్చారు. అలాగే డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామి కావాలని కరణ్ బజ్వాను ముఖ్యమంత్రి కోరారు. రెండు రోజుల సింగపూర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గూగుల్ ఆసియా – పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో వివిధ కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద ఏఐ, డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దే అంశాలపై చర్చించారు. మరోవైపు ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగంపై గూగుల్ క్లౌడ్‌ సహకారాన్ని ముఖ్యమంత్రి కోరారు. ఆధునిక క్లౌడ్ సాంకేతికతలను వినియోగించుకుని రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థను మరింత శక్తివంతం చేయాలనేది తమ సీఎం వివరించారు. అలాగే ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీలలో యువతకు భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ప్రతిపాదించారు. గూగుల్ క్లౌడ్‌తో కలిసి ఏఐ స్కిల్లింగ్, క్లౌడ్ సర్టిఫికేషన్ కార్యక్రమాలను విస్తరించాలని భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ కేంద్రాల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని… దీనికి గూగుల తెలిపింది.