GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 7:48 pm Digital Edition : GURU SWAMY

డిజిటల్ వేదికగా పార్టీ స్వరం- ప్రజల గొంతుగా ప్రతి కార్యకర్త

* ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్.
కుప్పం,సెప్టెంబర్ 27 (గరుడ ధాత్రి న్యూస్):తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా, విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకెళ్లాలని ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఆదివారం కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని కమతమూరు లోని శ్రీ దండు మారెమ్మ దేవాలయ మండపంలో ఐ.టీడీపీ వర్క్‌షాప్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో నియోజకవర్గ నాయకులతో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పంచాయతీ స్థాయి ఐటీడీపీ బాధ్యులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. డిజిటల్ మీడియా శక్తిని సమర్థవంతంగా వినియోగిస్తూ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ, ప్రతి ప్రజానికానికీ చేరవేయడంలో ఐటీడీపీ కార్యకర్తలు సమన్వయంతో, నిబద్ధతతో పనిచేయాలని శిక్షణ తరగతుల్లో సూచించడం జరిగింది.
ప్రపంచ పర్యాటక దినోత్సవం:
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మన దేశం, మన రాష్ట్రం ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, సాంస్కృతిక వారసత్వంతో ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే అపారమైన సంపదను కలిగి ఉంది. పర్యాటకం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది, మన సంస్కృతి ప్రపంచానికి మరింత చేరువ అవుతుంది. మన ప్రాంతంలోని పర్యాటక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములై వాటి పరిశుభ్రత, పరిరక్షణకు కృషి చేద్దాం అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ కుప్పం టిడిపి ఇన్చార్జి పి.ఎస్. మునిరత్నం, తదితరులు పాల్గొన్నారు.