డిప్యూటి సిఎం ను పరామర్శించిన సిఎం చంద్రబాబు

ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను, హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, వైద్యుల సూచనలు పాటిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సర్జరీ అనంతరం కొంత నీరసంగా కనిపించిన పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు స్నేహపూర్వకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు