GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 7:01 am Digital Edition : GURU SWAMY

డివైడర్‌పైనే మృతదేహం.. సౌకర్యాల కోసం బాధితుల అవస్థలు

*దశాబ్దాలుగా పట్టణంలో జీవిస్తున్న సంచారజాతులకు సొంత నివాసం కరవు

*మృతదేహాన్ని భద్రపరిచే ఫ్రీజర్‌కు విద్యుత్‌ అందక ఇబ్బందులు*

*మున్సిపల్‌ అధికారుల స్పందనపై బాధితుల ఆగ్రహం

*గరుడ దాత్రి నాయుడుపేట ఆగస్టు 21

నాయుడుపేట పట్టణంలో దశాబ్దాలుగా జీవిస్తున్న సంచారజాతుల కుటుంబాలు కనీస వసతుల కోసం ఇబ్బందులు పడుతున్నాయి. సుమారు 80–90 ఏళ్లుగా పట్టణంలోనే నివసిస్తూ చిన్నచిన్న వ్యాపారాలతో జీవనం సాగిస్తున్న తమకు ఇప్పటికీ సొంత నివాస స్థలం, శాశ్వత గూడు కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీజర్‌కు విద్యుత్‌ కోసం అవస్థలు
ఇటీవల ఆ వర్గానికి చెందిన ఓ వృద్ధుడు మృతి చెందడంతో మృతదేహాన్ని భద్రపరిచేందుకు ఫ్రీజర్‌ బాక్స్‌ ఏర్పాటు చేశారు. దానికి విద్యుత్‌ కనెక్షన్‌ కోసం బాధితులు, సామాజిక కార్యకర్తలు విద్యుత్‌ శాఖ అధికారులను సంప్రదించారు.విద్యుత్‌ శాఖ ఏఈ స్పందించి సిబ్బందిని పంపినప్పటికీ, అక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన విద్యుత్‌ పాయింట్‌ మాత్రమే అందుబాటులో ఉండటంతో మున్సిపల్‌ అధికారుల అనుమతి అవసరమని సిబ్బంది తెలిపారు.ఈ విషయంపై మున్సిపల్‌ విద్యుత్‌ విభాగం సిబ్బందిని సంప్రదించగా కమిషనర్‌ను కలవాలని సూచించినట్లు బాధితులు తెలిపారు. కమిషనర్‌కు పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందన లభించలేదని వారు ఆరోపించారు. విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఫ్రీజర్‌ పనిచేయక మృతదేహం నుంచి దుర్వాసన వెలువడిందని, దీంతో సమీపంలోని వ్యాపారులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.స్పందన కోరుతున్న బాధితులు
సమస్యపై వివరణ కోరేందుకు బాధితులు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లగా తమ వాదన వినకుండా బయటకు వెళ్లాలని చెప్పారని వారు ఆరోపించారు.దీంతో మున్సిపల్‌ యంత్రాంగం తీరుపై బాధితులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని డివైడర్‌ వద్ద ఉంచాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని పేర్కొన్నారు.