– నారాయణవనం సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతల పిలుపు
నారాయణవనం ఆగస్టు 4 గరుడదాత్రి న్యూస్ :
సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల పార్టీ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.సమావేశంలో డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పార్టీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్న ముఖ్య నేతల సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు, మహా ధర్నాలను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు.ప్రతి మండలం, గ్రామం, వార్డు స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి డీఎస్సీ అంశంపై విస్తృత అవగాహన కల్పించాలని, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, ప్రజలు ఉద్యమ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి బలంగా తీసుకెళ్లేలా ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.