-పూర్తి వివరాలతో చర్చకు ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, శాప్ చైర్మన్ రవినాయుడు…
పసలేని ఆరోపణలు చేసిన వైసిపి నాయకులు…
-చర్చకు ప్రెస్ క్లబ్ వద్ద 2 గంటసేపు ఎదురు చూసిన కూటమి శ్రేణులు
తిరుపతి, జూన్ 13 :
డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ ఆరోపణలు పూర్తిగా నిరాధారాల
శనివారం ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు తెలియజేశారు
తిరుపతి లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంచెర్ల శ్రీకాంత్, శాప్ చైర్మన్
అనిమినీ రవి నాయుడు లు మాట్లాడుతూ డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా నియామకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు, రాజకీయ దురుద్దేశపూరితమైనవని స్పష్టం చేశారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన 16,347 మంది అభ్యర్థులు, వారి కుటుంబాల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు.
స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో కూడా పూర్తి స్థాయి ధృవీకరణ ప్రక్రియ అనంతరమే ఎంపికలు జరిగాయని, అర్హత కలిగిన అభ్యర్థులకే ఉద్యోగాలు లభించాయని స్పష్టం చేశారు. నియామకాల్లో అవినీతి జరిగి ఉంటే ఖాళీ పోస్టులు మిగిలి ఉండేవి కాదన్నారు.
ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రతిపక్ష హక్కు అయినప్పటికీ, నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకుని నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సూచించారు.
డీఎస్సీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, టీసీస్ ఐన్ సాంకేతిక వ్యవస్థ ద్వారా పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రశ్నాపత్రాలను ఎన్క్రిప్టెడ్ విధానంలో భద్రపరిచినట్లు వివరించారు. ప్రతి అభ్యర్థికి వేర్వేరు ప్రశ్నల క్రమం అందేలా రాండమైజేషన్ అమలు చేశామని, బహుళస్థాయి భద్రతా వ్యవస్థల కారణంగా పేపర్ లీకేజీకి ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు.డీఎస్సీ నియామకాల పై వచ్చిన ప్రతి అభ్యంతరానికి అధికారులు, శాఖాధిపతులు, ప్రభుత్వం ఇప్పటికే ఆధారాలతో సమాధానాలు ఇచ్చినప్పటికీ, వైసీపీ నేతలు మళ్లీ అదే ఆరోపణలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సవాల్‌కు వైసీపీ ప్రతినిధులు హాజరుకాకపోవడం వారి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని నిరూపించిందన్నారు.
డీఎస్సీ పరీక్షలో ర్యాంక్ సాధించిన నవీన్ అనే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా వారు ఖండించారు. ఆయన సర్టిఫికెట్ వెరిఫికేషన్, తదుపరి ఎంపిక ప్రక్రియలకు హాజరు కాలేదని, కేవలం ర్యాంక్ రావడం మాత్రమే ఉద్యోగానికి అర్హత కాదని స్పష్టం చేశారు.
స్పోర్ట్స్ కోటా నియామకాలు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరిగాయని తెలిపారు. అన్ని దరఖాస్తులు డిజిటల్ రూపంలో స్వీకరించబడ్డాయని, సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయబడ్డాయని చెప్పారు. నిపుణుల కమిటీ అర్హతలను పరిశీలించిన అనంతరమే ఎంపికలు జరిగాయని పేర్కొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఎటువంటి క్రీడా సర్టిఫికెట్లు జారీ చేయదని, గుర్తింపు పొందిన సంఘాలు, ఫెడరేషన్లు, విశ్వవిద్యాలయాలు మాత్రమే వాటిని జారీ చేస్తాయని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి, విద్యా రంగంలో నమోదవుతున్న సానుకూల ఫలితాలను పక్కదారి పట్టించేందుకు వైసీపీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు డీఎస్సీ నిర్వహిస్తుందని, ఖాళీ పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తుందని తెలిపారు. డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా అంశాలపై అన్ని ఆధారాలు, పత్రాలతో బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నాయకులను మరోసారి ఆహ్వానించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకుని, ప్రజలను మరియు నిరుద్యోగ యువతను రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే ప్రయత్నాలు విరమించాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రతిపక్ష హక్కు అయినప్పటికీ, నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే బదులు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, శ్రీ తాతయ్య గుంట గంగమ్మ గుడి చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్, కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ తోట వాసుదేవ్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ రూపేష్ వర్మ, ఆనంద్ గౌడ్ లు పాల్గొన్నారు.