GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 5:42 pm Digital Edition : GURU SWAMY

డీలర్లు సకాలంలో సక్రమంగా రేషన్ పంపిణీ చేయాలి

కార్వేటి నగరం, సెప్టెంబర్ 18: రేషన్ షాప్ డీలర్లు కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో, సక్రమంగా రేషన్ పంపిణీ చేయాలని తహసీల్దార్‌ కె. నాగరాజు సూచించారు.: కార్యక్రమవరం సెప్టెంబర్ 18 (గరుడాదాద్రి న్యూస్)
కార్వేటి నగరం తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం రేషన్ షాప్ డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ డీలర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ షాప్ పరిధిలోని 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ చేయాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం సివిల్‌ సప్లైస్‌ డిప్యూటీ తహసీల్దార్‌ మోహన్‌రాజు మాట్లాడుతూ, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా రేషన్‌ పంపిణీని సక్రమంగా నిర్వహించాలని, కార్డుదారులకు మెరుగైన సేవలు అందించాలని డీలర్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లీస్ డిప్యూటీ తాసిల్దార్ మోహన్ రాజ్ , డిప్యూటీ తహసీల్దార్‌ లోకేష్‌, ఆర్‌ఐ నరసింహులు, డీలర్ల సంఘం అధ్యక్షులు లక్ష్మీపతి, లోకనాథం, రేషన్ షాప్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.