GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 6:58 am Digital Edition : GURU SWAMY

డీ.ఎం.పురం ఉన్నత పాఠశాలలో ‘మిషన్‌ మార్చ్‌’పై సమీక్ష *​పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: డిప్యూటీ ఈవో మహేశ్వరరావు

*​570 పైగా మార్కులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి: కార్వేటి నగర్ సెప్టెంబర్ 28 (గరుడదాద్రి న్యూస్):పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని డిప్యూటీ విద్యాశాఖాధికారి (డిప్యూటీ ఈవో) మహేశ్వరరావు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని డీ.ఎం.పురం ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి, పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఎస్సెస్సీ మిషన్ మార్చ్‌’ కార్యాచరణపై విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమగ్రంగా చర్చించారు.
​అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాబోయే పబ్లిక్ పరీక్షల్లో పాఠశాల నుంచి 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, విద్యార్థులు 570కి పైగా మార్కులు సాధించే దిశగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు (రెమిడియల్ టీచింగ్) నిర్వహించాలని, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టాలని తెలిపారు.రైసింగ్ స్టార్స్ ను షైనింగ్ స్టార్ గా అభివృద్ధి చెందేలా ప్రణాళిక ప్రకారం తరగతులు నిర్వహించాలన్నారు.
​విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళికాబద్ధంగా చదివి, పట్టుదలతో పరీక్షలు రాయాలని సూచించారు. ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఉత్తమ ర్యాంకులు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి, ఉపాధ్యాయ బృందం సరస్వతి, మాలతి, కలై వాణి, సుమతి, రాములు, హరి, వ్యాయామ సంచాలకులు కిషోర్ కుమార్, రంజిత్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.