డీ.ఎం.పురం ఉన్నత పాఠశాలలో ‘మిషన్‌ మార్చ్‌’పై సమీక్ష *​పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: డిప్యూటీ ఈవో మహేశ్వరరావు

*​570 పైగా మార్కులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి: కార్వేటి నగర్ సెప్టెంబర్ 28 (గరుడదాద్రి న్యూస్):పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని డిప్యూటీ విద్యాశాఖాధికారి (డిప్యూటీ ఈవో) మహేశ్వరరావు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని డీ.ఎం.పురం ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి, పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఎస్సెస్సీ మిషన్ మార్చ్‌’ కార్యాచరణపై విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమగ్రంగా చర్చించారు. ​అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాబోయే...