GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 9:08 pm Digital Edition : GURU SWAMY

డెంగ్యూ నివారణపై వైద్య సిబ్బంది అవగాహన

పలమనేరు, సెప్టెంబర్ 20 (గరుడ ధాత్రి ) :
పట్టణంలోని బసవన్న కట్ట వీధిలో అనుమానాస్పద డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఆ ప్రాంతంలో పర్యటించారు. పలమనేరు సబ్ యూనిట్ ఆఫీసర్ జయశంకర్ ఆధ్వర్యంలో ఆ ఇంటిని సందర్శించి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫీవర్ సర్వే, లార్వా సర్వేలను ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇళ్ల వద్ద నీరు నిల్వ ఉండే పాత టైర్లు, పగిలిన కుండలు, పూల కుండీలు, పనికిరాని డబ్బాలు మరియు ఫ్రిజ్ వెనుక భాగంలో ఉన్న నీటిని సిబ్బందితో కలిసి పారబోయించారు. అనంతరం స్థానిక ప్రజలకు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు, వాటి నివారణా చర్యలపై సబ్ యూనిట్ ఆఫీసర్ జయశంకర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పార్వతి, యరప రెడ్డి, ఆశా వర్కర్ షాహీనా తదితరులు పాల్గొన్నారు.