డెంగ్యూ నివారణపై వైద్య సిబ్బంది అవగాహన

పలమనేరు, సెప్టెంబర్ 20 (గరుడ ధాత్రి ) : పట్టణంలోని బసవన్న కట్ట వీధిలో అనుమానాస్పద డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఆ ప్రాంతంలో పర్యటించారు. పలమనేరు సబ్ యూనిట్ ఆఫీసర్ జయశంకర్ ఆధ్వర్యంలో ఆ ఇంటిని సందర్శించి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫీవర్ సర్వే, లార్వా సర్వేలను ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇళ్ల వద్ద నీరు నిల్వ ఉండే పాత టైర్లు, పగిలిన కుండలు, పూల కుండీలు, పనికిరాని డబ్బాలు మరియు ఫ్రిజ్...