ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ సమ్మిట్ 2026, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు తో కలిసి పాల్గొన్న చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.
దేశ రాజధాని ఢిల్లీలో..
జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న రిపబ్లిక్ సమ్మిట్ 2026లో, అలాగే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారితో కలిసి పాల్గొన్నారు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు..
అంతకు ముందు ఢిల్లీ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఢిల్లీ ఎయిర్ పోర్టులో చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు సహచర పార్లమెంటు సభ్యులతో కలిసి సాదర స్వాగతం పలికారు.