GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 7:54 pm Posted by : GARUDA DHATRI NEWS

ఢిల్లీ వేదికగా కేవీబీపురం యువనేతకు జాతీయ గౌరవం

ఢిల్లీ వేదికగా కేవీబీపురం యువనేతకు జాతీయ గౌరవం

గ్లోబల్ బిజినెస్ అవార్డు అందుకున్న పల్లా ముని శేఖర్ యాదవ్

గరుడ దాత్రి న్యూస్ :

మండలంలోని వేములపూడి గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా నాయకుడు పల్లా ముని శేఖర్ యాదవ్ న్యూఢిల్లీలో అరుదైన జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. రాజధాని వేదికగా ఘనంగా నిర్వహించిన “భారత్ గౌరవ రాష్ట్రరియా పురస్కార్–2026” కార్యక్రమంలో ప్రముఖ పోలీసు ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన గ్లోబల్ బిజినెస్ అవార్డు ప్రదానం చేయడం విశేషంగా నిలిచింది.వ్యాపార రంగంలో ఆయన చూపిన విశిష్ట ప్రతిభ, సమాజాభివృద్ధి పట్ల కనబరిచిన నిబద్ధత, యువతకు స్ఫూర్తినిచ్చే నాయకత్వ లక్షణాలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. జాతీయ స్థాయి వేదికపై ఈ గౌరవం అందుకోవడం ద్వారా కేవీబీపురం మండలానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సామాజిక సేవకులు, వ్యాపారవేత్తలు హాజరై పల్లా ముని శేఖర్ యాదవ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కృషి, పట్టుదల, సేవాభావం ఉంటే సాధారణ స్థాయి నుంచి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందవచ్చని శేఖర్ యాదవ్ నిరూపించారని కొనియాడారు.
పల్లా ముని శేఖర్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.