తగ్గని భానుడి భగభగలు…!
తగ్గని భానుడి భగభగలు...అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు -వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 29 మంది మృతి గరుడధాత్రి : విశాఖపట్నం (ఏయూ ప్రాంగణం): భానుడి భగభగలకు రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మంగళవారం గుంటూరు జిల్లా ములుకుదురులో అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ‘పల్నాడు జిల్లా గురజాలలో 47.6, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 జిల్లాల పరిధిలోని 125 మండలాల్లో ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది....