తడ అపార్ట్మెంట్స్ నిర్లక్ష్యంతో దుర్గంధంలో రాచకండ్రిగ వీధులు గ్రామస్తుల వినతులను పట్టించుకోని అధికారులు

తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం పరిధిలోని రాచకండ్రిగ గ్రామంలో తడ అపార్ట్మెంట్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్మెంట్స్ నుంచి వెలువడుతున్న డ్రైనేజీ మురుగునీటిని యథేచ్ఛగా గ్రామ రోడ్లపైకి వదిలేయడంతో వీధులన్నీ మురుగునీటితో నిండిపోయి దుర్గంధభరితంగా మారాయి.రోడ్లపై నిల్వ ఉన్న మురుగునీటి వల్ల గ్రామస్తులు, పాదచారులు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ దారుల్లో సంచరించేందుకు భయపడుతున్నారు. దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు పెరిగి ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసమస్యపై...