తడ మండలంలో ప్రజా సమస్యలపై ఎంపీడీవోకు ఫిర్యాదు

సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డి. కిరణ్ కుమార్ తడ, సెప్టెంబర్ 12 (గరుడధాత్రి): తడ మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డి. కిరణ్ కుమార్ మండల ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి కొరత, పారిశుద్ధ్య లోపం, వీధి దీపాలు వెలగకపోవడం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా అనపగుంట గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని,...