తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. టీవీకే (TVK) అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీని సంపాదించారు.
ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ 107 స్థానాల్లో విజయం సాధించగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కు మరో 11 స్థానాల దూరంలో నిలిచింది. అయితే కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ప్రకటించడంతో విజయ్ బలం 118కు చేరుకుంది. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
🟡 పార్టీల బలం ఇలా…
🔸 టీవీకే – 107
🔸 కాంగ్రెస్ – 5
🔸 వీసీకే – 2
🔸 సీపీఐ – 2
🔸 సీపీఎం – 2
ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీ నిరూపించాల్సిందేనని గవర్నర్ స్పష్టం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా సీపీఐ ప్రధాన కార్యదర్శి D. రాజ తో పాటు వీసీకే నాయకత్వంతో కూడా ఖర్గే ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది.
ఇక శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు విజయ్ గవర్నర్‌ను కలిసి మద్దతు పత్రాలు సమర్పించనున్నారు. అనంతరం టీవీకే, కాంగ్రెస్, వీసీకే, వామపక్ష పార్టీలతో కలిసి ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ అనంతరం సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంపై స్పష్టత రానుంది.