తల్లిపాలు బిడ్డకు రక్షణ కవచం: సీడీపీఓ ఉమారాణి
పలమనేరు, ఆగస్టు 07 ( గరుడ ధాత్రి ) : పలమనేరు అర్బన్ సెక్టారు పరిధిలోని కేవీఎస్ స్ట్రీట్ అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం సీడీపీఓ ఉమారాణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీడీపీఓ ఉమారాణి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నజ్మా తల్లులకు, గర్భవతులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీడీపీఓ ఉమారాణి మాట్లాడుతూ... తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని పేర్కొన్నారు. కాన్పు అయిన వెంటనే వచ్చే ముర్రుపాలు బిడ్డకు మొదటి టీకా (వ్యాక్సిన్)...