GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 8:13 am Posted by : GURU SWAMY

తాతయ్యగుంట గంగమ్మ జాతర ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సమీక్ష.

తాతయ్యగుంట గంగమ్మ జాతర ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సమీక్ష.

– జాతర చివరి ఘట్టమైన అమ్మవారి “విశ్వరూప దర్శనం” కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశాలు.

– తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ ఎల్‌. సుబ్బరాయుడు ఐపిఎస్‌., గారు.

– భక్తుల రద్దీ నియంత్రణ, క్యూలైన్ మేనేజ్‌మెంట్‌, పిల్లలు తప్పిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు.

– సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణతో పాటు విజిబుల్ పోలీసింగ్ మరింత పెంచాలని సూచనలు.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్‌. సుబ్బరాయుడు ఐపిఎస్‌., గారు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు ఆలయ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు ఆలయ పరిసర ప్రాంతాలను అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించి భక్తుల రాకపోకలు, క్యూలైన్ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు.
అలాగే జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పిల్లలు తప్పిపోకుండా ప్రత్యేక హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రజలకు నిరంతరం ప్రకటనలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆలయ ప్రాంగణం, ప్రధాన రహదారులు, క్యూలైన్లు మరియు రద్దీ ప్రాంతాలను సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతి కీలక ప్రాంతంలో పోలీసు సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. భక్తుల భద్రతకు ఎటువంటి లోటు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు.
ఈ నెల 5వ తేదీ నుండి అత్యంత వైభవంగా జరుగుతున్న గంగమ్మ జాతర మహోత్సవాల చివరి ఘట్టమైన విశ్వరూప దర్శనం “అమ్మవారి చెంప నరకుడు” కార్యక్రమం అర్ధరాత్రి నుండి ఉదయం వరకు కొనసాగనున్న నేపథ్యంలో భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ రవి మనోహర చారి,గారు తిరుపతి డిఎస్పీ శ్రీ భక్తవత్సలం, గారు ట్రాఫిక్ డిఎస్పీ శ్రీ కొండయ్య,గారు సంబంధిత సీఐలు, ఆలయ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.