తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుమల తరహాలో విద్యుత్ అలంకరణలు
* టీటీడీ జేఈవో ఏ.శరత్. కుప్పం,సెప్టెంబర్ 28 (గరుడ ధాత్రి ప్రత్యేక ప్రతినిధి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తరహాలో ఆకట్టుకునే విద్యుత్ అలంకరణలు చేపట్టాలని టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 5 నుంచి 14 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, తిరుచానూరుతో పాటు తిరుపతిలోని ప్రధాన కూడళ్లను సుందరంగా అలంకరించాలని సూచించారు. ముఖ్యంగా గజవాహనం, పంచమి తీర్థం రోజుల్లో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో...