తిరుపతిలో కల్తీ ఆహారం, కుళ్ళిన మాంసం విక్రయాలపై సమగ్ర విచారణ జరపాలి

-బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి -జిల్లా కలెక్టర్‌కు సీపీఎం, సీపీఐ నాయకుల వినతి తిరుపతి నగరంలో వరుసగా వెలుగులోకి వస్తున్న కల్తీ ఆహారం, నాసిరకం మాంసం, చేపల విక్రయాల ఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొంటూ సీపీఎం, సీపీఐ నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ ఆహార మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి. సుబ్రహ్మణ్యం, సీపీఐ నగర...