GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 11:03 am Digital Edition : GURU SWAMY

తిరుపతి జిల్లాలోని మండలాలకు ప్రత్యేక అధికారుల నియామకం: జిల్లా కలెక్టర్ డా. వి. వెంకటేశ్వర్

*తిరుపతి, సెప్టెంబర్ 25:* మండల ప్రజా పరిషత్‌ల పాలకవర్గాల పదవీకాలం 2026 సెప్టెంబర్ 23 నాటితో ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మండలాలకు ప్రత్యేక అధికారులు నియమించేలా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలోని మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మండల ప్రత్యేక అధికారులు సెప్టెంబర్ 24వ తేదీ నుండి బాధ్యతలు స్వీకరించనున్నారని, వీరు కొత్తగా ప్రజాప్రతినిధులు ఎన్నిక కాబడి బాధ్యతలు చేపట్టే వరకు లేదా గరిష్టంగా ఆరు నెలల కాల పరిమితి వరకు మండల ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు నిర్వహించునున్నారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారులు, డిప్యూటీ డైరెక్టర్లు, ఆర్‌డీవోలు మరియు ఎంపీడీవో కంటే పై స్థాయి హోదా కలిగిన అధికారులను ఈ ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని తెలిపారు.

నాగలాపురం మండలానికి మైన్స్ అండ్ జియాలజీ ఏడి బాలాజీ నాయక్, పిచ్చాటూరు మండలానికి పిచ్చాటూరు పశుసంవర్ధక శాఖ ఏడి పి చంద్రశేఖర్ రెడ్డి, లను మండల ప్రత్యేక అధికారులుగా నియమించారు.