తిరుపతి జిల్లాలోని మండలాలకు ప్రత్యేక అధికారుల నియామకం: జిల్లా కలెక్టర్ డా. వి. వెంకటేశ్వర్
*తిరుపతి, సెప్టెంబర్ 25:* మండల ప్రజా పరిషత్‌ల పాలకవర్గాల పదవీకాలం 2026 సెప్టెంబర్ 23 నాటితో ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మండలాలకు ప్రత్యేక అధికారులు నియమించేలా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలోని మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల ప్రత్యేక అధికారులు సెప్టెంబర్ 24వ తేదీ నుండి బాధ్యతలు స్వీకరించనున్నారని, వీరు కొత్తగా ప్రజాప్రతినిధులు ఎన్నిక కాబడి బాధ్యతలు చేపట్టే వరకు లేదా గరిష్టంగా...