తిరుపతి, సెప్టెంబర్ 21 గరుడధాత్రి న్యూస్ :
తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన నాయకులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం ఘనంగా జరిగింది.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బాలగురవం బాబుచేతుల మీదుగా ఆమూరి కృష్ణమూర్తి,తిరుపతి వైస్ ప్రెసిడెంట్ గా, గొడుగుచింత గోపి తిరుపతి జిల్లా కార్యదర్శిగా నియామక పత్రాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు బాలగురువం బాబు మాట్లాడుతూ, పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులకు స్వాగతం పలికారు. పార్టీ దిశా నిర్దేశాలు, భవిష్యత్ కార్యాచరణపై వారికి సూచనలు చేశారు.
బాలగురవం బాబు మాట్లాడుతూ…
“రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగించడం ఖాయం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్. షర్మిలమ్మ నాయకత్వంలో, తిరుపతి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాము. ప్రతి కార్యకర్త కష్టపడి పని చేసి, రాబోయే ఎన్నికల్లోనే ప్రత్యర్థులకు సమాధానం చెప్పాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.