తిరుపతి జిల్లా కాంగ్రెస్ లో నూతన నియామకాలు
తిరుపతి, సెప్టెంబర్ 21 గరుడధాత్రి న్యూస్ : తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన నాయకులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బాలగురవం బాబుచేతుల మీదుగా ఆమూరి కృష్ణమూర్తి,తిరుపతి వైస్ ప్రెసిడెంట్ గా, గొడుగుచింత గోపి తిరుపతి జిల్లా కార్యదర్శిగా నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు బాలగురువం బాబు మాట్లాడుతూ, పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులకు స్వాగతం పలికారు. పార్టీ దిశా నిర్దేశాలు, భవిష్యత్ కార్యాచరణపై వారికి సూచనలు చేశారు....