GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 7:33 pm Digital Edition : GURU SWAMY

తిరుపతి జిల్లా సమీక్షా సమావేశంలో… కాంగ్రెస్ నేతలు

శ్రీకాళహస్తి ఆగస్టు 02 (గరుడ దాత్రీ న్యూస్):

తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం,తడ మండలం నందు నేడు జరిగినటువంటి జిల్లా సమీక్షా సమావేశం నందు పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నేతలు.
డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని,అటువంటి దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది అని ప్రజలు కాంగ్రెస్ పార్టీనీ కోరుకుంటున్నారని,రాబోవు రోజులు కాంగ్రెస్ పార్టీ వేనని ప్రతి ఒకరు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని తెలిపారు.తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని,నేడు కాంగ్రెస్ పార్టీ నీ చూస్తుంటే పూర్వ వైభవం అత్యంత త్వరలోనే రాబోతుందని,అందరం సమష్టి కృషి తో పార్టీ నీ ప్రజలలోకి తీసుకుపోవడానికి ప్రతి ఒకరం సైనికుల వల్లే పనిచేయాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు,ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, రాష్ట్ర ఓ బి సి సెల్ కార్యదర్శి భాస్కర్ రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు కరీముల్లా,లోకనాదం,గురుమూర్తి, జిల్లా కార్యదర్శి ఇళయరాజా,గోపి,జిల్లా అధికార ప్రతినిధి శ్రీను గౌడ్,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు నాయకుల ఫయాజ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు హరి,ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండలం అధ్యక్షులు రాహుల్ రాయల్, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షులు సునీల్ రెడ్డి, సూళ్లూరుపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు కిరణ్,రమేష్,లోకేష్,దొరస్వామి రెడ్డి,రాజేంద్ర,మహిళా నాయకురాలుశ్వేత,చాముండేశ్వరి, సుజాత, బాబు, అరుణ్, చరణ్, చందు, ఆసిఫ్, సాయి, నాగరాజు, మహేష్,తిరుమలై, షణ్ముగం, జిల్లా నాయకులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.