తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్
తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి నీ దర్శించుకున్న జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆలయ పూజారి శాస్త్రోక్తంగా పూజలు చేసి అమ్మవారి హారతి, తీర్థ ప్రసాదాలు జిల్లా కలెక్టర్ కు అందజేశారు.
మంగళవారం రాత్రి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి దర్శనం చేసుకొన్న అనంతరం ఆలయం వద్ద ఏర్పాట్లు ను, కమాండ్ కంట్రోల్ రూమ్ ను మున్సిపల్ ఇంచార్జి కమిషనర్ శారదా దేవి, తాతయ్య గుంట గంగమ్మ ఆలయ చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్ లతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తులకు మంచి దర్శన భాగ్యం కల్పించేల ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ప్రతి సంవత్సరం మున్సిపల్ కార్పొరేషన్, తుడా, టీటీడీ వారి సహకారంతో ప్రతి సంవత్సరం జాతరను ప్రతి ఏడాది జిల్లాలో వైభవంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. గంగమ్మ జాతర ఏర్పాట్ల పై నెల రోజుల నుంచి జిల్లా స్థాయిలో ప్రజా ప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు. గంగమ్మ జాతర సందర్భంగా ప్రత్యేక ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గంగమ్మ జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను మునిసిపల్ ఇంచార్జి కమిషనర్, తాతయ్య గుంట గంగమ్మ ఆలయసిబ్బంది, పర్యవేక్షించుకుంటున్నారని, జాతరకు వచ్చిన భక్తులతో ఏర్పాట్లు కు సంబంధించిన అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగిందని వారు ఏర్పాట్లు చక్కగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అని అన్నారు. ప్రత్యేకమైనటువంటి బందోబస్తు, కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తూ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్నందువలన భక్తులకు త్రాగునీరు, మజ్జిగ వంటి సదుపాయాలను దేవాదాయ శాఖ వారు ఏర్పాటు చేశారని తెలిపారు. గంగమ్మ తల్లిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం ఎంతో సంతోషంగా ఉందని ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నానని అన్నారు.
కలెక్టర్ గారితో పాటు ఆలయ ఈవో జయ కుమార్, దేవాదాయ శాఖ అధికారులు రామకృష్ణారెడ్డి, రామకృష్ణా, సిబ్బంది తదితరులు ఉన్నారు.