GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 8:01 am Posted by : GARUDA DHATRI NEWS

తిరుపతి ని డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి…

తిరుపతి ని డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి…
యువతను గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుదాం…
జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి…
గరుడధాత్రి న్యూస్ :
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి ని గంజాయి డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం బైరాగి పట్టణంలోని తన కార్యాలయంలో రాజారెడ్డి మీడియాతో మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో గంజాయి డ్రగ్స్ బారిన పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ స్వార్థ రాజకీయాలకు గంజాయి కి డ్రగ్స్ కు అలవాటు చేసి వారి చేత
చేయరాని పనులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల వైసీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ భూమన అభినయ రెడ్డి ముఖ్య అనుచరుడు భాను ను గంజాయి కేసులో తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. తిరుపతిలో గంజాయి డ్రగ్స్ ను ప్రోత్సహిస్తున్నది వైసిపి నాయకులేనని, యువత తమ బంగారు భవిష్యత్తును అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేస్తున్నారని చెప్పారు. తిరుపతి నగరంలో యువత విద్యార్థులను గంజాయి డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే గంజాయి డ్రగ్స్ ను రాష్ట్రం నుండి తరిమి వేయాలని కంకణం కట్టుకున్నారని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జన సైనికులు వీర మహిళలు గంజాయి ని లేకుండా చేసేందుకు శ్రీకారం చుట్టారన్నారు. తిరుపతిలో గంజాయి మత్తులో యువత ఏమి చేస్తున్నారు తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. గంజాయి డ్రగ్స్ ను ప్రోత్సహిస్తున్న వారు ఎంతటి వారైనా పోలీసులు కఠినంగా శిక్షించి కేసులు నమోదు చేయాలన్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం డ్రగ్స్ ను నివారించేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారన్నారు. ఏది ఏమైనా పార్టీలకతీతంగా అందరూ ఏకమై ప్రజాసంఘాలతో పాటు ముందుకు వచ్చి తిరుపతి నగరంలో గంజాయి డ్రగ్స్ ను లేకుండా తరిమి వేయాలన్నారు. గంజాయి డ్రగ్స్ ను ప్రోత్సహిస్తున్న రాజకీయ నాయకులు ఎవరైనా సరే అటువంటివారిని తిరుపతి నగరం నుంచి వెలివేయాలని జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి హెచ్చరించారు.