GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 5:30 am Posted by : GARUDA DHATRI NEWS

తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ సి.పి.రాధకృష్ణన్

తిరుమల, 2026 ఏప్రిల్ 27

తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ సి.పి.రాధకృష్ణన్

భారత ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ సి.పి.రాధాకృష్ణన్ సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు.

తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న గౌ|| ఉప రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ రామ్మూర్తి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్లు, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.