తిరుమలలో జనతా క్యాంటీన్ల ధరల దోపిడీ..! టీటీడీ లక్ష్యానికి విరుద్ధంగా భక్తులపై అదనపు భారం
తిరుమలలో సామాన్య భక్తులకు తక్కువ ధరలకు నాణ్యమైన ఆహారం అందించాలన్న టీటీడీ లక్ష్యం జనతా క్యాంటీన్ల వద్ద నీరుగారుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ అద్దెకు స్థలాలు కేటాయించినప్పటికీ, కొన్ని జనతా క్యాంటీన్ల నిర్వాహకులు పెద్ద క్యాంటీన్లు, ఏపీ టూరిజం హోటళ్ల కంటే అధిక ధరలు వసూలు చేస్తూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తిరుమలకు వచ్చే లక్షలాది భక్తులకు టీటీడీ ఉచిత అన్నప్రసాదాన్ని అందిస్తున్నప్పటికీ, తమ అభిరుచికి అనుగుణంగా ఇతర ఆహార పదార్థాలను కొనుగోలు చేసే భక్తులు జనతా క్యాంటీన్లను ఆశ్రయిస్తుంటారు. అయితే అక్కడ వసూలు...