తిరుమలలో నకిలీ ఆధార్‌లతో రూమ్ దందా.. ఆరుగురు దళారీల అరెస్ట్

తిరుమల, ఆగస్టు 8 గరుడధాత్రి : తిరుమలలో భక్తుల గది కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న రూమ్ దళారీల ముఠా గుట్టురట్టైంది. నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో టీటీడీ గదులను పొందుతూ.. వాటిని అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను తిరుమల II టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, ఐపీఎస్ ఆదేశాలతో తిరుమలలో రూమ్ దళారీలపై ప్రత్యేక...