తిరుమలలో భక్తులకు విస్తృత వసతి సౌకర్యాలు..

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం తదితర సదుపాయాలను కల్పిస్తోంది.భక్తులు దర్శనానికి ముందు స్నానమాచరించి పవిత్రంగా స్వామివారి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ కావడంతో, భక్తుల ఆచారాలు మరియు మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమల, తిరుపతిలో అనేక వసతి గదులు మరియు యాత్రికుల వసతి సముదాయాలను టీటీడీ నిర్మించింది. గదుల కేటాయింపు విధానం...