తిరుమల టీటీడీ బోర్డు మెంబర్ నకిలీ సిఫార్సు లెటర్లతో దర్శనం పేరుతో మోసం – నిందితుడు అరెస్ట్
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ. తేదీ: 26.04.2026. - తిరుమల టీటీడీ బోర్డు మెంబర్ నకిలీ సిఫార్సు లెటర్లతో దర్శనం పేరుతో మోసం – నిందితుడు అరెస్ట్. - తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు తిరుమల II టౌన్ పోలీసులు, శ్రీవారి ప్రత్యేక దర్శనం (Break Darshan) కల్పిస్తానని చెప్పి మోసం చేస్తున్న చాగంటి నవీన్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. - ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన బాధితురాలు అనిత, తన కుటుంబ...