GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 4:45 pm Digital Edition : GURU SWAMY

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్‌అఫిషియో సభ్యుడు, తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
ఉదయం విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఈ నాయకులకు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందించారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు నాయకులను ఆత్మీయంగా పలకరించారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.