పలమనేరు, అక్టోబర్ 08( గరుడ ధాత్రి ) :
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. గురువారం ఉదయం స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ… స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామి ఆశీస్సులు ప్రజల పై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్విబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, యువరాజులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.