తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే తిరుగులేని బలం

వేపూరు గ్రామ మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కుప్పం,జులై 29(గరుడ ధాత్రి న్యూస్):తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే తిరుగులేని బలం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. బుధవారం కుప్పం రూరల్ మండలం వేపూరు గ్రామంలో మహిళలతో ముఖాముఖిలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎత్తిన జెండా దించకుండా పని చేస్తారన్నారు. టీడీపీ కార్యకర్తలకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు.గత ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేస్తే మహిళలు బయటకొచ్చి నిరసన...