తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ తెలుగు నిర్మాత మృతి…

*తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ తెలుగు నిర్మాత మృతి..* తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ నిర్మాత, నటుడు, త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి బాబు) కన్నుమూశారు.చాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలియగానే టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. వారసత్వం నుంచి స్వయంకృషి.. కృష్ణా జిల్లా గుడ్ల వల్లేరుకు చెందిన ప్రముఖ దిగ్గజ రచయిత, 'మహారథి'గా పిలవబడే త్రిపురనేని మహారథి కుమారుడిగా...