GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 9:47 pm Digital Edition : GURU SWAMY

తైక్వండో పోటీల్లో ప్రతిభ చాటిన లక్కనపల్లి విద్యార్థులు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్2

బైరెడ్డిపల్లి మండలం లోని లక్కనపల్లి జడ్.పి.ఉన్నత పాఠశాల విద్యార్థినులు జిల్లా స్థాయి తైక్వండో పోటీల్లో సత్తాచాటి పథకాలు సాధించారని పాఠశాల హెచ్.ఎం.కవిత పేర్కొన్నారు ఎం.ఆర్.పల్లి జడ్ పి ఉన్నత పాఠశాలలో గత నెల
30 న నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వండో పోటీల్లో 9వ తరగతి విద్యార్థిని జయంతి బంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలు కు
ఎంపిక నట్లు ఆమె తెలిపారు. లోకేశ్వరి రజితం, సరళ, గీతిక కాంస్య పతాకలు సాధించారన్నారు అనంతపురం లో ఈ నెల 12 నుండి 14 వరకు జరిగే రాష్ట్ర స్థాయి తైక్వండో పోటీల్లో జయంతి పాల్గొంటారన్నారు.విద్యార్థినులను హెచ్.ఎం.కవిత ,పి.డి.
సాయితేజ హర్షం వ్యక్తం చేసి అభినందించారు.అలాగేతైక్వండో పోటీల్లో తమ గ్రామ విద్యార్థినులు సత్తాచాటి పతాకలు పొందటం గర్వ కారణం అని విజితలను,వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులు ను అభినందించి శుభాకాంక్షలను గ్రామ పెద్ద రఘుచంద్ర గుప్త ఒక ప్రకటన లో తెలియజేసారు.